Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివాహ బంధానికి ముగింపు.. విడాకులు తీసుకుంటున్న ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ దంప‌తులు!

Aamir Khan and Kiran Rao announce divorce after 15 years of marriage
  • 15 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై
  • తీపి జ్ఞాప‌కాలు మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌ని వ్యాఖ్య‌
  • త‌మ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న
తాము విడాకులు తీసుకుంటున్నట్టు బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావ్ దంపతులు సంయుక్త‌ ప్ర‌క‌ట‌న చేశారు. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ వైవాహిక బంధంలోని ఎన్నో తీపి జ్ఞాప‌కాలు, చిరున‌వ్వులు, హాయిగా గ‌డిపిన రోజులు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌పై తాము త‌మ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ, త‌మ కుమారుడి బాధ్య‌త‌ను ఇద్ద‌రం తీసుకుంటామ‌ని తెలిపారు. సినిమాలు, పానీ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో క‌లిసే ప‌నిచేస్తామ‌ని చెప్పారు. తాము విడిపోవాల‌ని కొంత కాలం క్రితమే నిర్ణ‌యం తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామ‌ని వివ‌రించారు. కాగా, ఆమిర్ ఖాన్ 1986లో రీనా ద‌త్త‌ను పెళ్లి చేసుకుని, 2002లో విడాకులు తీసుకున్నారు. అనంత‌రం కిర‌ణ్ రావ్‌ను 2005లో ఆమిర్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతోనూ విడిపోతున్నాడు. ఆమిర్ ఖాన్ దంప‌తులు చేసిన ప్ర‌క‌ట‌న‌..
 
Aamir Khan
Bollywood

More Telugu News